తెరపైకి రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక
- హీరోగా రాజశేఖర్ కి మంచి క్రేజ్
- సినీరంగంలోకి పెద్ద కూతురు శివాని
- అక్కబాటలోనే వెళ్లనున్న శివాత్మిక
ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక కూడా నటన వైపే ఆసక్తిని చూపుతోందట. ఈ విషయాన్ని జీవిత రాజశేఖర్ స్వయంగా చెప్పారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక స్కూల్ ను ఏర్పాటు చేసి, ఆ స్కూల్ నిర్వహణ బాధ్యతలను శివాత్మికకి అప్పగించాలని రాజశేఖర్ భావించారట. కానీ అక్క మాదిరిగానే శివాత్మిక కూడా నటనపట్ల ఆసక్తిని చూపుతుండటంతో, ఆ దిశగానే ఆమెను ప్రోత్సహించేందుకు జీవిత రాజశేఖర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.