‘ఆర్ఎక్స్ 100’ తమిళం రీమేక్ లో తాప్సీ!
- తెరకెక్కించనున్న అవురా సినిమాస్
- హీరోగా ఆదిని కన్ఫామ్ చేసిన నిర్మాతలు
- దర్శకుడికి ఇంకా రాని స్పష్టత
తమిళ వెర్షన్ ఆర్ఎక్స్ 100 లో హీరోగా ఆది పినిశెట్టిని నిర్మాతలు ఎంపిక చేసుకున్నారు. మిరుగం, ఈరం, మరకదనానయం వంటి సినిమాల్లో నటించిన ఆదికి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆది సరసన తాప్సీని ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆడుకలం, కాంచన, ఆరంభం వంటి సినిమాల్లో నటించిన తాప్సీని నిర్మాతలు ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఇంకా దర్శకుడు ఎవరో ఖరారు కాలేదు. అక్టోబర్ మూడో వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.