సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- స్పెషల్ సాంగ్స్ గురించి తమన్నా!
- పవన కల్యాణ్ సినిమా రీమేక్ లో శింబు
- 'ఎన్టీఆర్' షూటింగులో రానా
* పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని తమిళంలో లైకా ప్రొడక్షన్స్ రీమేక్ చేస్తోంది. సుందర్ సి దర్శకత్వం వహించే ఈ చిత్రంలో పవన్ పాత్రను శింబు పోషిస్తున్నాడు.
* రానా దగ్గుబాటి 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగులో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో ఆయన చంద్రబాబు నాయుడి పాత్రను పోషిస్తున్న సంగతి విదితమే. ఇందుకోసం ఇటీవల చంద్రబాబుని కూడా కలసి ఆయన సలహాలు తీసుకున్నాడు.