స్కూలు యూనిఫామ్ లో కమెడియన్లు!: ఫొటోలు విడుదల చేసిన వెన్నెల కిశోర్
- థీమ్ పార్టీకి హాజరైన నటులు
- చిన్నషార్ట్ వచ్చిందన్న వెన్నెల కిశోర్
- వైరల్ గా మారిన ఫొటోలు

‘బ్యాక్ టు స్కూల్’ పేరుతో పార్టీ చేసుకున్న కమెడియన్లు.. పొట్టి నిక్కర్లు, హాఫ్ షర్టులు, టై ధరించి ఫన్నీగా ఉన్న సన్నివేశానికి సంబంధించిన ఫొటోను కిశోర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కమెడియన్లు సప్తగిరి, ధన్ రాజ్, రోలర్ రఘు, చిత్రం శీను, వేణు వండర్ తదితరులు ఈ ఫొటోలో ఉన్నారు. ఈ పార్టీలో వేసుకోవడానికి తనకు చిన్న షార్ట్ వచ్చిందని కిశోర్ చెప్పాడు. కాగా, ఈయన పోస్ట్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.