వైఎస్ భారతిపై కేసు విషయంలో చంద్రబాబుకేమి సంబంధం?: డిప్యూటీ సీఎం చినరాజప్ప
- ఈడీ కేంద్ర పరిధిలోని సంస్థ అని జగన్ కు తెలియదా?
- తుని ఘటనతో చంద్రబాబుకు సంబంధం లేదు
- జగన్ ఆధ్వర్యంలోనే ఈ ఘటన జరిగింది
జగన్ లో తప్పు చేశాననే పశ్చాత్తాపం ఎక్కడా లేదు
ఈడీ కేసులు నమోదు చేస్తే దానినీ జగన్ రాజకీయం చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. జగన్ లో తప్పు చేశాననే పశ్చాత్తాపం ఎక్కడా కనిపించడం లేదని, జగన్ కు ప్రజలపై ప్రేమ ఉంటే దోచుకున్న ధనాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు. తన భార్య భారతిని అడ్డం పెట్టుకుని జగన్ సానుభూతి పొందాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రం కుట్రలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు పావుగా ఉపయోగపడుతున్నారని ఎద్దేవా చేశారు.