ప్రధాని మోదీకి గ్రీన్ ఛాలెంజ్ విసిరిన పుల్లెల గోపీచంద్
- రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన గోపీచంద్
- మొక్క నాటి మరికొందరిని నామినేట్ చేసిన కోచ్
- దేశాన్ని పచ్చగా మార్చుదామని పిలుపు
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ, దేశాన్ని పచ్చగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా తానో మొక్కను నాటినట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ కు విశేష స్పందన లభిస్తోంది. ఛాలెంజ్‌కు నామినేట్ అయిన వారు మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి సవాలు విసురుతున్నారు. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన గోపీచంద్ మొక్క నాటాడు. మరికొందరికి సవాలు విసిరాడు.