'రోబో' కథ నాదే: కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన దర్శకుడు శంకర్
- రజనీ, ఐశ్వర్య జంటగా 'యందిరన్'ను తెరకెక్కించిన శంకర్
- ఆ కథ నాదేనంటూ తమిళనాథన్ అనే రచయిత కేసు
- కౌంటర్ పిటిషన్ వేసిన శంకర్
అయితే, 'యందిరన్' కథ తనదేనంటూ తమిళనాథన్ అనే దర్శకుడు కోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో, శంకర్ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో, ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా కథ తనదేనని... తమిళనాథన్ చెబుతున్న కథకు, తన సినిమాకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం.