'RISH'తో పాటు 'I'ని రివీల్ చేసిన వంశీ పైడిపల్లి... మహేష్ టైటిల్ అదేనా?
- ఐదు అక్షరాలు వదిలిన మహేష్ చిత్ర టీమ్
- సినిమా టైటిలా? చిత్రంలో మహేష్ పాత్ర పేరా?
- మరో మూడు రోజుల్లో వెల్లడి
'ఐ' లెటర్ ను ఈ ఉదయం 9:15 గంటల సమయంలో సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి తన ట్విట్టర్ ఖాతాలో రివీల్ చేశాడు. వీటిని చూస్తుంటే ఇదే టైటిల్ అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. సినిమా పేరు 'రిషి' అని కొందరు 'మహర్షి' అయ్యుంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఇక చిత్రంలో మహేష్ పాత్ర పేరు 'రిషి' అయ్యుంటుందని, సినిమా పేరు వేరేగా ఉంటుందని అంటున్నవారూ లేకపోలేదు. ఏదేమైనా ఈ విషయంలో సస్పెన్స్ తొలగాలంటే, మరో మూడు రోజులు ఆగక తప్పదు.