జీవీఎల్ ఒక ఆంధ్రా బ్రహ్మానందం: టీడీపీ నేత బుద్ధా వెంకన్న
- ఏపీ అభివృద్ధిని జీవీఎల్ అడ్డుకోవడం తగదు
- మోదీకి ఊడిగం చేయడం జీవీఎల్ నైజం
- బాబుపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం
ఏపీ అభివృద్ధిని జీవీఎల్ అడ్డుకోవడం తగదని, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు పదవులే ముఖ్యం తప్ప రాష్ట్ర అభివృద్ధి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కన్నా అవినీతిపై జీవీఎల్ సీబీఐ విచారణ ఎందుకు కోరరని ప్రశ్నించారు. మోదీ తాతగారి సొమ్ము ఏమైనా ఏపీకి ఇస్తున్నారా? అని ప్రశ్నించిన బుద్ధా వెంకన్న, పోస్టర్లు వేసి మరీ, మిమ్మల్ని ద్రోహులు అని ప్రజలకు చాటి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.