బాలయ్యతో బోయపాటి మూవీ బడ్జెట్ 100 కోట్లు!
- బాలకృష్ణకి లైన్ వినిపించిన బోయపాటి
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలకృష్ణ
- గతంలో భారీ హిట్స్ కొట్టిన కాంబినేషన్
కథ ప్రకారం బడ్జెట్ 100 కోట్ల వరకూ వుండచ్చని బాలకృష్ణకి బోయపాటి చెప్పాడట. అందుకు బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ ను 80 కోట్ల బడ్జెట్ తో చేస్తున్నారు. ఆ తరువాత ఆయన బోయపాటితో చేయనున్న సినిమాకి 100 కోట్లు పెట్టనున్నారు. బాలకృష్ణ కెరియర్లోనే ఈ స్థాయి బడ్జెట్ తో నిర్మిస్తోన్న సినిమా ఇదేనని అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ జోడీకట్టే భామలెవరో చూడాలి.