ఎవరిని ఉద్ధరించడానికి ఈ 'కికి'?: మంచు లక్ష్మి
- ఏదైనా పనికొచ్చే పనులు చేయండి
- గ్రీన్ చాలెంజ్ ని స్వీకరించండి
- 'కికి' చాలెంజ్ వద్దే వద్దన్న మంచు లక్ష్మి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ చాలెంజ్ ని స్వీకరిస్తే, దేశం పచ్చగానైనా మారుతుందని హితవు పలికింది. కాకుంటే 'గిఫ్ట్ ఏ హెల్మెట్' చాలెంజ్ తీసుకుని ప్రమాదాలను అరికట్టించేందుకు తనవంతు సహకారాన్ని ఇవ్వాలని సూచించింది. ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన పెంచే పనులు చేయకుండా, ఈ పిచ్చి చాలెంజ్ లు ఎందుకని అడిగింది. వీటిని అరికట్టాలని, 'కికి' చాలెంజ్ వద్దే వద్దని మంచు లక్ష్మి సలహా ఇచ్చింది.