మహేశ్ బాబు మేనల్లుడు తెరపైకి వచ్చేశాడు!
- హీరోగా సుధీర్ బాబుకి మంచి క్రేజ్
- చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన పెద్దబ్బాయి
- 'గూఢచారి'తో చిన్నబ్బాయి పరిచయం
తాజాగా సుధీర్ బాబు రెండవ అబ్బాయి .. అంటే మహేశ్ బాబు చిన్న మేనల్లుడు 'దర్శన్' కూడా తెలుగు తెరకి పరిచయమైపోయాడు. ఈ రోజున థియేటర్స్ కి వచ్చిన 'గూఢచారి' సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో దర్శన్ కనిపించనున్నాడు. సుధీర్ బాబు ఇద్దరు పిల్లలు కూడా ముద్దుగా ముచ్చటగా ఉంటారు. అందువలన చైల్డ్ ఆర్టిస్టులుగా వీళ్లు బిజీ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. మేనమామ బాటలో నడిచేసి భవిష్యత్తులో హీరోలైపోయినా ఆశ్చర్యం లేదు.