ధర్మపురి సంజయ్ అమ్మాయిల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు: పీవోడబ్ల్యూ నేత సంధ్య
- సంజయ్ పై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి
- ‘శాంకరీ’ నర్సింగ్ అమ్మాయిలు నన్ను కలిశారు
- వాళ్ల హాస్టళ్లకి కూడా వెళతాడట
ధర్మపురి సంజయ్ అమ్మాయిల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడని, వారిపై నిరంతరం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ‘కళాశాలలో అమ్మాయిలను లావుగా ఉంటే బక్కగా అవ్వమంటాడు.. బక్కగా ఉంటే దొడ్డుగా అవ్వమంటాడు.. అమ్మాయిలకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయా? లేదా? అని అడుగుతుంటాడు. బయట హాస్టళ్లలో శాంకరీ కళాశాల విద్యార్థినులు ఉంటే.. అక్కడికి కూడా సంజయ్ వెళ్లి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు’ అని సంజయ్ పై సంధ్య ఆరోపణలు చేశారు.