అప్పట్లో పవన్ కల్యాణ్ ఏం చెప్పినా బుర్ర కెక్కేది కాదు: 'తొలిప్రేమ' ఫేమ్ వాసుకి
- 'తొలిప్రేమ'లో పవన్ చెల్లెలిగా నటించిన వాసుకి
- ఆయన వేదాంతం చెబుతుండేవారన్న నటి
- తనకు ఏ మాత్రం అర్థమయ్యేది కాదట
తాజాగా ఆమె ఓ యూ ట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం షూటింగ్ ఖాళీ సమయాల్లో పవన్ వేదాంతం మాట్లాడుతూ ఉండేవారని గుర్తు చేసుకుంది. అప్పటికి తన వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమేనని చెప్పిన వాసుకి, పవన్ చెప్పే ఫిలాసఫీ తన బుర్రకు ఏ మాత్రం ఎక్కేది కాదని, అవి ఎంతో విలువైన మాటలని మాత్రం తెలిసేదని చెప్పింది.