దిల్ రాజు నిర్మాతగా బన్నీ హీరోగా 'సభకు నమస్కారం'
- బన్నీకి కథ వినిపించిన దిల్ రాజు
- కథ బాగుందన్న బన్నీ
- దర్శకుడి ఎంపిక గురించిన చర్చలు
నాని హీరోగా దిల్ రాజు ఒక సినిమా చేయాలనుకున్నారు. ఈ సినిమాకి 'సభకు నమస్కారం' అనే టైటిల్ ను కూడా సెట్ చేసుకున్నారు. నానీ బిజీగా ఉండటం .. మంచి కథ కోసం అల్లు అర్జున్ వెయిట్ చేస్తుండటంతో, ఈ కథను బన్నీకి వినిపించారట దిల్ రాజు. కథ నచ్చడంతో బన్నీ ఓకే అనేశాడని సమాచారం. ఈ ప్రాజెక్టుని ఏ దర్శకుడికి అప్పగించాలనే విషయంపైనే చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుందని చెబుతున్నారు.