భారీ గ్రాఫిక్స్ తో ఉత్కంఠను రేపనున్న 'సువర్ణ సుందరి'
- విజువల్ వండర్ గా 'సువర్ణ సుందరి'
- ప్రధానమైన పాత్రల్లో పూర్ణ .. జయప్రద
- సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు
'చరిత్ర .. భవిష్యత్తును వెంటాడుతుంది' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. టైటిల్ ను బట్టే ఇది నాయికా ప్రాధాన్యత కలిగిన చిత్రమని తెలిసిపోతోంది. ఈ సినిమాలో ఈ తరం కథానాయిక పూర్ణ నటించగా, ఆమె కూతురు పాత్రలో .. నిన్నటి తరం కథానాయిక జయప్రద నటించడం విశేషం. ఇతర ముఖ్య పాత్రల్లో సాక్షి చౌదరి .. సాయికుమార్ .. కోట శ్రీనివాసరావు కనిపించనున్నారు. విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దామనీ .. సెప్టెంబర్లో విడుదల చేయనున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.