సక్సెస్ కోసం రూటు మార్చుతోన్న గోపీచంద్
- వరుస పరాజయాలు
- సక్సెస్ కోసం వెయిటింగ్
- థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్
అయితే కొంతకాలంగా ఈ తరహా సినిమాలు చేసినా ఆయనకి సరైన హిట్ పడటం లేదు. వరుస పరాజయాలు ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రూట్ మార్చి కొత్తదనం చూపించాలనే నిర్ణయానికి వచ్చేశాడు. అందులో భాగంగానే ఆయన థ్రిల్లర్ మూవీ చేయడానికి అంగీకరించాడు. నూతన దర్శకుడు కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి .. నవంబర్ లో సినిమాను పూర్తిచేయాలనే ఆలోచనలో వున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది.