కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ, రజనీకాంత్
- కరుణానిధి ఆరోగ్యంపై ఆరా
- తమిళనాడు ఆత్మ కరుణానిధి: రాహుల్
- కరుణానిధి త్వరగా కోలుకోవాలి: రజనీకాంత్
కరుణానిధి కుటుంబంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన తమిళనాడు ఆత్మ అని అన్నారు. కరుణ అభిమానులు, ప్రజలు ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తున్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని వారితో పాటు తాను కూడా ప్రార్థిస్తున్నట్టు రాహుల్ చెప్పారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఓ సందేశం పంపిన విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు.
కాగా, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు పరామర్శించారు. అనంతరం, మీడియాతో రజనీ మాట్లాడుతూ, కరుణానిధి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. కరుణానిధి ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు కరుణానిధి అని అన్నారు.