ఘోర ప్రమాదంలో నిండు చూలాలి మృతి... సహాయక చర్యలకు వెళ్లిన అధికారులకు కనిపించిన శిశువు!
- ప్రసవం కోసం వెళుతుంటే ప్రమాదం
- కడుపు పగిలి బయటకు వచ్చిన చిన్నారి
- చిన్నారిని కాపాడి ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు
ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్, ఆ గర్బిణీ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో గర్భిణి పొట్ట పగిలిపోయి శిశువు బయటకు వచ్చింది. ఈ విషయం తెలియని పోలీసులు, వాహనాన్ని తొలగించి గర్భిణి మృతదేహాన్ని బయటకు తీస్తుండగా, పక్కనే కొద్ది దూరంలో గడ్డిలో అప్పుడే పుట్టిన శిశువు ఏడుపు వినిపించింది. ఆ చిన్నారిని సురక్షితంగా ఆసుపత్రికి చేర్చిన అధికారులు, మృతి చెందిన గర్భిణీ బంధువుల కోసం ఆరా తీస్తున్నారు.