మళ్లీ అమెరికా వెళుతోన్న రవితేజ టీమ్
- కామెడీ ఎంటర్టైనర్ గా 'అమర్ అక్బర్ ఆంటోని'
- నెల రోజులకి పైగా అమెరికాలో షూటింగ్
- ముఖ్యమైన పాత్రలో సునీల్
వచ్చేనెల 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకూ అక్కడ షూటింగ్ జరగనుంది. యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు .. పాటలను అక్కడ చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో క్రితంసారి జరిగిన షెడ్యూల్లో ఇలియానా పాల్గొంది. తదుపరి షెడ్యూల్ కోసం ఇలియానా కూడా అమెరికా చేరుకోనుంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కమెడియన్ గా సునీల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.