తెలుగు సినిమా కోసం మెగాఫోన్ పట్టేస్తోన్న రేణు దేశాయ్
- తెలుగులో నేరుగా సినిమా చేస్తున్నాను
- కథ .. స్క్రీన్ ప్లే సిద్ధం చేసేశాను
- ప్రస్తుతం సంభాషణలు రాస్తున్నాను
తాజాగా ఈ విషయంపై ఆమె స్పందిస్తూ .. ఇందులో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. తాను తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నది నటిగా కాదనీ .. దర్శకురాలిగానని అన్నారు. తెలుగులో నేరుగా ఒక సినిమాకి దర్శకత్వం వహించనున్నానని చెప్పారు. ఆల్రెడీ కథ - స్క్రీన్ ప్లే సిద్ధమైపోయాయనీ, ప్రస్తుతం డైలాగ్స్ రాస్తున్నానని అన్నారు. సంక్రాంతి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. ఈ సినిమాలోనూ తాను కనిపించననీ .. కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు.