రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'నన్ను దోచుకుందువటే'
- ముగింపు దశలో 'నన్నుదోచుకుందువటే'
- సుధీర్ బాబు సరసన నాభా నటేశ్
- వినాయక చవితికి రిలీజ్
అక్కడ చిత్రీకరిస్తోన్న పాటతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తయినట్టేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసేశారు. 'వినాయక చవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో సుధీర్ బాబు వున్నాడట. ఈ ఏడాది ఈ సినిమాతో ఆయన మరో హిట్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి.