రణబీర్ నాకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.. అందుకే దూరమయ్యా: దీపికా పదుకునే
- నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే అనుబంధానికి విలువ ఉండదు
- రణబీర్ నుంచి విడిపోయాక మానసికంగా కుంగిపోయా
- ఆ తర్వాత నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడ్డా
ఒక అనుబంధంలో ఉన్నప్పుడు తన పార్ట్ నర్ ను తానెప్పుడూ మోసం చేయలేదని దీపిక తెలిపింది. నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే, ఆ అనుబంధానికి విలువ ఏముంటుందని ప్రశ్నించింది. రణబీర్ తనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని... మరో అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడ్డాడని చెప్పింది. అయితే, మరోసారి ఫూల్ కాకూడదనే ఉద్దేశంతోనే అతనికి దూరమయ్యానని తెలిపింది. విడిపోయిన తర్వాత మానసికంగా కుంగిపోయానని... ఆ తర్వాత ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటపడ్డానని చెప్పింది.