మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్న రవితేజ
- సెట్స్ పై 'అమర్ అక్బర్ ఆంటోని'
- నెక్స్ట్ మూవీ వీఐ ఆనంద్ తో
- త్వరలోనే పూర్తి వివరాలు
ఇటీవల ఆయన రవితేజకి కథను వినిపించడం .. అది కొత్తగా ఉండటంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. రెండు పాత్రల మధ్య చాలా వైవిధ్యం ఉంటుందనీ .. ఆ వైవిధ్యం ఆడియన్స్ ను కట్టిపడేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు రవితేజతో 'నేల టికెట్' తీసిన నిర్మాతలే ఈ సినిమాకి కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.