టెంట్ కూడా సరిగా వేసుకోలేనోళ్లు ఈ దేశాన్ని నిర్మిస్తారట: మోదీపై మమతా బెనర్జీ వ్యంగ్యం
- మోదీపై పశ్చిమబెంగాల్ సీఎం విమర్శలు
- కేంద్రంలో బీజేపీని గద్దె దించి తీరుతాం
- ఈ విషయంలో మా రాష్ట్రం ముందుంటుంది
కోల్ కతాలో నిర్వహించిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న మమత మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీని గద్దె దించి తీరుతామని, ఈ విషయంలో తమ రాష్ట్రం ముందుంటుందని అన్నారు. కాగా, 1993లో విక్టోరియా హౌస్ వద్ద జరిగిన కాల్పుల్లో పదమూడు మంది యూత్ కాంగ్రెస్ వర్కర్లు మృతి చెందిన ఘటనను నిరసిస్తూ ప్రతి ఏటా జులై 21న అమరవీరుల దినోత్సవంను తృణమూల్ కాంగ్రెస్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కోల్ కతాలో ఈరోజు నిర్వహించిన ర్యాలీకి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.