పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభుదేవా
- నిర్మాతగా ప్రభుదేవా బిజీ
- నటుడిగా విభిన్నమైన పాత్రలు
- పురాతన విగ్రహాల చోరీ నేపథ్యంలో సాగే కథ
గతంలో ప్రభుదేవా దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన ఏసీ ముగిల్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. తొలిసారిగా ప్రభుదేవా ఈ సినిమాలో పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. చోరీకి గురైన పురాతన విగ్రహాలను గుర్తించి .. తిరిగి రాష్ట్రానికి తీసుకురావడంలో పోలీస్ ఆఫీసర్ పొన్ మాణిక్యవేల్ ఎంతో కృషి చేశారు. ఆయన పాత్ర ప్రధానంగానే ఈ సినిమా రూపొందుతోందని అంటున్నారు.