మరో ప్రేమకథగా 'పేపర్ బాయ్' .. టీజర్ రిలీజ్
- నిర్మాతగా మారిన సంపత్ నంది
- యూత్ మెచ్చే 'పేపర్ బాయ్'
- నాయకా నాయికల నూతన పరిచయం
ఈ సినిమా ద్వారా దర్శకుడిగా జయశంకర్ .. హీరో హీరోయిన్లుగా సంతోష్ శోభన్ .. రియా సుమన్ లు పరిచయమవుతున్నారు. ముఖ్యమైన పాత్రలో తన్యా హోప్ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. నాయకా నాయికలకి సంబంధించిన దృశ్యాలపై ఈ టీజర్ ను కట్ చేశారు.
"అయిదున్నర అడుగుల సంప్రదాయం తను .. 50 కిలోల తెలుగుతనం తను .. అందుకే అయిదేళ్లుగా ఆ ఇంటికి ప్రతిరోజు వెళ్లి చూసి గుడ్ మార్నింగ్ చెప్పి వస్తున్నాను" అంటూ పేపర్ బాయ్ గా హీరో వాయిస్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తోంది.