'శైలజా రెడ్డి అల్లుడు'కి షూటింగ్ పూర్తిచేసిన రమ్యకృష్ణ
- షూటింగు దశలో 'శైలజా రెడ్డి అల్లుడు'
- నా అభిమాన నటి రమ్యకృష్ణ
- ఆమె నటన అద్భుతం అంటున్నమారుతి
ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనున్నారు. చైతూ పాత్ర వైపు నుంచి చూస్తే ఆమె శ్రీమంతురాలు .. అహంభావం కలిగిన అత్తగారు పాత్రలో అదరగొట్టేయనున్నారు. గతంలో ఈ తరహా పాత్రలను వాణిశ్రీ ఎక్కువగా పోషించేవారు. అలాంటి పాత్రలో రమ్యకృష్ణ చేస్తుండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక నుంచి ఈ తరహా పాత్రలకి ముందుగా రమ్యకృష్ణ పేరు గుర్తుకు వస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.