రవితేజతో ఆ ప్రాజెక్టును ప్రస్తుతానికి ఆపేశారట!
- రవితేజకి వరుస పరాజయాలు
- శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని'
- నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్
ఇటీవల రవితేజ చేసిన 'నేల టిక్కెట్టు' .. 'టచ్ చేసి చూడు' సినిమాలు పరాజయం పాలయ్యాయి. అందువలన ఆయనతో వరుసగా రెండు సినిమాలు చేయడం కరెక్ట్ కాదని భావించినట్టు సమాచారం. 'అమర్ అక్బర్ ఆంటోని' రిజల్ట్ చూసుకుని అప్పుడు రెండవ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళదామని అలా దానిని హోల్డ్ లో పెట్టేశారట. ఆ సినిమా హిట్ అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది .. లేదంటే లేదన్న మాట.