దిల్ రాజు నిర్మాతగా కొత్త హీరోతో 'పలుకే బంగారమాయే'
- నిర్మాతగా వరుస సినిమాలు
- అన్నివర్గాల వారిని అలరించే ఆలోచన
- దసరా రోజున కొత్త సినిమా లాంచ్
తన కజిన్ .. వ్యాపార భాగస్వామి అయిన శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఆయన ఒక సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకి 'పలుకే బంగారమాయే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'బొమ్మరిల్లు'లో .. అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు పరిచయం కానున్నట్టుగా సమాచారం. దసరా రోజున ఈ సినిమాను లాంచ్ చేసి .. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నట్టు తెలుస్తోంది.