'యాత్ర' టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ .. లక్షల్లో వ్యూస్
- మహి వి.రాఘవ్ దర్శకత్వంలో 'యాత్ర'
- ప్రధానమైన పాత్రలో మమ్ముట్టి
- టీజర్ తో పెరుగుతోన్న అంచనాలు
అదే ఊపును కొనసాగిస్తూ ఇప్పుడు ఈ టీజర్ 12 లక్షలకి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. గూగుల్ ట్రెండ్స్ లోను ఈ టీజర్ ప్రముఖంగా నిలిచింది. ఇక ఫేస్ బుక్ .. వాట్సాప్ లలోను ఈ టీజర్ అదే జోరును కొనసాగించింది. వాట్సాప్ లో చాలామంది స్టేటస్ లో ఈ సినిమా టీజర్ కనిపించడం విశేషం. ఈ సినిమా టీజర్ కి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం పట్ల యూనిట్ సభ్యులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందని చెప్పడానికి ఈ వ్యూస్ నిదర్శనమని చెప్పుకుంటున్నారు.