నన్ను వదిన అంటే ఆనందమే .. కానీ పవన్ తో ముడిపెడుతూ అలా పిలవొద్దు!: రేణు దేశాయ్
- మామూలుగా వదిన అంటే ఫర్లేదు
- పవన్ పేరును జోడించవద్దు
- నేను ఇప్పుడు ఆయన భార్యను కాదు
వదినమ్మ అనేది చాలా మంచి మాట .. అలా పిలవడం వలన నాకు ప్రోబ్లం లేదు. పవన్ పేరును జోడిస్తూ అలా పిలవడమే సమస్య. నేను ఇప్పుడు ఆయన భార్యను కాదు కదా .. మాములుగా వదిన అనండి .. కాదనను. ఆల్రెడీ ఆయనకి ఇంకొకరితో పెళ్లైపోయింది .. ఇద్దరు పిల్లలు వున్నారు. ఆయన అభిమానులకు సంబంధించి ఆవిడ వదిన కదా. ఆయన పేరును కలుపుతూ నన్ను వదిన అనడంలోనే నాకు ఇబ్బంది వుంది" అంటూ ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు.