ఇప్పుడు చెబుతున్నాను .. నిజంగా నేను విడాకులు అడగలేదు.. పవనే అడిగారు!: రేణు దేశాయ్
- నాకు చాలా కోపం వచ్చింది
- ఇద్దరి మధ్య గొడవ జరిగింది
- ఈ విషయం చెప్పడానికి బాధగా వుంది
నేను ఏ ఇంటికైతే కోడలిగా వెళుతున్నానో వాళ్లు కూడా నన్ను ఈ ప్రశ్న అడిగారు. జరగనున్నది అరేంజ్డ్ మేరేజ్ కనుక .. ఈ విషయానికి సంబంధించి నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ వీడియోలను కూడా వాళ్లు చూశారు. 'నీ తప్పులేనప్పుడు నిజం చెప్పడానికి ఎందుకు ఆలోచించడం?' అని వాళ్లు నన్ను అడిగారు. అందుకే ఈ సారి నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. విడాకులు నేను అడగలేదు .. ఈ విషయం కల్యాణ్ గారికి తెలుసు .. దేవుడికి తెలుసు. విడాకులు కావాలని ఆయన అడిగారు .. నాకు కోపం వచ్చింది. విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవ జరుగుతుందో .. అదే మా మధ్య జరిగింది. ఆయనకే విడాకులు కావాలి .. ఆయనే అడిగారు .. ఈ విషయాన్ని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా వుంది" అంటూ ఇబ్బంది పడ్డారు.