Lord Sriram: మీ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడితే తట్టుకోలేరు: నాగబాబుపై విరుచుకుపడ్డ కత్తి మహేష్

  • శ్రీరాముడిని విమర్శించిన కత్తి మహేష్
  • కత్తి మహేష్ పేరు చెప్పకుండా నాగబాబు విమర్శలు
  • అస్థిత్వం లేని వ్యక్తి మాట్లాడుతున్నాడని నిప్పులు

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మండిపడ్డాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ మేరకు ఓ వీడియోను పోస్టు చేసిన కత్తి, నాగబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. తన పేరు చెప్పకుండా, తనను నీచుడిగా సంబోధించిన వీడియోను తాను చూశానని, దాన్ని చూసిన తరువాత తనకు జాలి కలిగిందని అన్నాడు. తాను ఎందుకు నీచుడినో చెప్పాలని ప్రశ్నించాడు. తమ్ముడికి అన్నగా తప్ప, మరే విధమైన అస్థిత్వం లేని వ్యక్తి తన గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

మీ కుటుంబం ఏమైనా రామ భక్తులా? అని ప్రశ్నించిన కత్తి, ప్రజలను మోసం చేస్తూ, ఉన్న పార్టీలను అమ్ముకుని వేరే పార్టీలో చేరడం, 'జబర్దస్త్'లో కూర్చుని పిచ్చి నవ్వులు నవ్వడమే సమాజానికి మీరు చేస్తున్న సేవని నిప్పులు చెరిగాడు. మీ కుటుంబం, మీ సోదరుల గురించి తాను మాట్లాడితే తట్టుకోవడం కష్టమని హెచ్చరిస్తూ, తాను చావడానికి సిద్ధమని, అయితే తనపై ఏదైనా చెయ్యి పడితే దానికి బాధ్యత మీదేనని అన్నాడు.

తాను చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోకుండా వార్నింగ్ ఇస్తున్నారని ఆరోపించిన కత్తి, మీ రాజకీయ, సినిమా జీవితాలు ఎంత దౌర్భాగ్యమో అందరికీ తెలిసే రోజు వస్తుందని, మీ పతనానికి మీరే పునాదులను తవ్వుకుంటున్నారని అన్నాడు. ఓ దళితుడిని నీచుడని సంబోధించారంటే, ఎంతో అహకారం ఉండి వుండాలని, సెక్యులర్ హిందువు ఎక్కడి నుంచి వచ్చారని కత్తి ప్రశ్నించాడు. దళితులపై, ముస్లింలపై దాడులు జరిగినప్పుడు ఏం చేస్తున్నారని దుయ్యబట్టాడు.

Lord Sriram
Kathi Mahesh
Nagababu
Chiranjeevi
  • Error fetching data: Network response was not ok

More Telugu News