కేరళ 'దొంగనోట్ల నటి' వెనుక ఓ స్వామీజీ... సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు!
- బీజూ అనే దొంగస్వామి ద్వారా దందాలోకి
- తమిళనాడులోనూ నకిలీ నోట్ల చలామణి
- మరింత లోతుగా విచారిస్తున్న పోలీసులు
ఒక్క కేరళకే ఆమె దొంగ నోట్లు పరిమితం కాలేదని, తమిళనాడులోనూ వాటిని చలామణిలోకి తేవడానికి ఏజంట్లతో ఒప్పందం కుదుర్చుకుందని విచారణలో గుర్తించిన పోలీసులు, తమ దర్యాఫ్తును పక్క రాష్ట్రానికి విస్తరించాలని నిర్ణయించారు. కాగా, కొద్ది రోజుల క్రితం రూ. 2.50 లక్షల నకిలీ కరెన్సీతో తమకు పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను విచారించిన పోలీసులు ఆపై సూర్యా శశికుమార్ ఇంట్లో తనిఖీ చేయగా, రూ. 57 లక్షల విలువైన నకిలీ నోట్లు లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన మాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపగా, ప్రస్తుతం ఆమెతో పాటు ఆమె తల్లి రమాదేవి, సోదరి శృతిలను పోలీసులు విచారిస్తున్నారు.