ఇప్పట్లో విలన్ గా నటించే ఉద్దేశం లేదు: గోపీచంద్
- గోపీచంద్ హీరోగా రూపొందిన 'పంతం'
- ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు
- మరో రెండు సినిమాలు లైన్లో
అయితే ఇటీవల కాలంలో ఆయనకి సరైన హిట్ పడలేదు. దాంతో ఒక వైపున హీరోగా చేస్తూనే మరో వైపున విలన్ గాను చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడనే ప్రచారం మొదలైంది. తాజాగా ఈ ప్రచారంపై గోపీచంద్ స్పందిస్తూ .. " నేను విలన్ గా కూడా చేయనున్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదు .. ఇప్పట్లో అలాంటి ఆలోచన కూడా లేదు. నూతన దర్శకుడు కుమార్ తోను .. సంపత్ నందితోను చేయాల్సిన ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను" అని చెప్పుకొచ్చాడు.