హీరోలతో చనువుగా లేనందుకే కొన్ని సినిమాల నుంచి నన్ను తప్పించారు: మల్లికా షరావత్
- చనువుగా ఉండమని హీరోలు అడిగేవాళ్లు
- అర్ధరాత్రి 3 గంటల సమయంలో పిలిచేవాళ్లు
- ఓ ఇంటర్వ్యూలో మల్లికా షరావత్
'మర్డర్' చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైన తనకు అటువంటి పాత్రలే వచ్చాయని, హీరోలు, దర్శకుల కారణంగానే తనలోని నటి దూరమై, హాట్ గార్ల్ గా మిగిలానని వెల్లడించింది. తెరపై పొట్టి దుస్తులు వేసుకుని, ముద్దు సన్నివేశాల్లో నటించిన తనను సిగ్గు వదిలేసిన మహిళంటూ నిందలు వేశారని చెప్పింది. తొలినాళ్లలో ఎలాంటి పాత్రల్లోనైనా నటించడమే తాను చేసిన తప్పని చెప్పింది. గత కొంతకాలంగా మల్లిక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.