హ్యూమా ఖురేషి పారితోషికం భారీగా డిమాండ్ చేస్తోందట
- బాబీ దర్శకత్వంలో మల్టీ స్టారర్
- హీరోలుగా వెంకీ .. చైతూ
- టైటిల్ గా 'వెంకీమామ'
వెంకటేశ్ .. నాగచైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ ఒక మల్టీ స్టారర్ ను ప్లాన్ చేశాడు. ఈ సినిమాకి 'వెంకీమామ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన హ్యూమా ఖురేషి అయితే బాగుంటుందని సంప్రదించారు. అయితే ఆమె భారీ పారితోషికమే డిమాండ్ చేస్తోందట. ఈ విషయంలోనే చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. పారితోషికం విషయంలో హ్యూమా ఖురేషి ఒక మెట్టుదిగితే ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని అంటున్నారు.