ఈ మూవీ విజయ్ దేవరకొండ చేయాల్సిందట!
- అజయ్ భూపతి దర్శకుడిగా 'ఆర్ ఎక్స్ 100'
- కార్తికేయ జోడీగా పాయల్ రాజ్ పుత్
- ఈ నెల 12వ తేదీన విడుదల
"కథను తయారుచేసుకున్న తరువాత ముందుగా విజయ్ దేవరకొండకే వినిపించాను. ఈ కథ ఆయనకి బాగా నచ్చింది కూడా. అయితే అప్పటికే ఆయన కొన్ని సినిమాలకి సైన్ చేసేసి వున్నాడు. అయినా తప్పకుండా చేస్తాననీ .. కొంతకాలం వెయిట్ చేయమని చెప్పాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమా చేయాలంటే చాలా ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో నేను కొత్తవాళ్లతో చేసేశాను" అని అజయ్ భూపతి చెప్పుకొచ్చాడు. పోస్టర్స్ ను బట్టి .. ప్రోమోస్ ను బట్టి వయొలెంట్ లవ్ స్టోరీగా అనిపిస్తోన్న ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది.