కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోండి.. లేకపోతే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు: నాగబాబు
- రాముడిపై దారుణ వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై చర్యలు తీసుకోండి
- హిందూ మతంపై ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోంది
- రామాయణం అంటే ఒక పుస్తకం కాదు
హిందూమతం, హిందూ దేవుళ్లపై ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని నాగబాబు అన్నారు. నాస్తికత్వం పేరుతో హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రవర్తించేవారు శిక్ష అనుభవిస్తారని అన్నారు. మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడితే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కత్తి మహేష్ పై ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని... లేకపోతే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని చెప్పారు.