వైఎస్ జయంతి రోజున 'యాత్ర' టీజర్ రిలీజ్
- వైఎస్ బయోపిక్ గా 'యాత్ర'
- ప్రధానమైన పాత్రలో మమ్ముట్టి
- ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. సుహాసిని
ఈ సినిమా టీజర్ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి జయంతి కావడం వలన ఈ నిర్ణయం తీసుకున్నారట. జగపతిబాబు .. సుహాసిని .. రావు రమేశ్ .. అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం .. ప్రజలపై ఆయన చూపిన ప్రభావం ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందని చెబుతున్నారు.