సంగీత మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- స్మార్ట్ ఫోన్ రిటైల్ చైన్ నిర్వహిస్తున్న సంగీత
- రెండేళ్ల పాటు ప్రచారకర్తగా కొనసాగనున్న విజయ్
- డీల్ పై సంతకాలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ ఫోన్ భాగమైపోయిందని వ్యాఖ్యానించారు. ఈ డీల్ కుదుర్చుకున్న తరువాత తనపేరు విజయ్ దేవరకొండ బదులు సంగీత దేవరకొండ అయిపోయిందని చమత్కరించాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ, ప్రస్తుతం తాము 500 స్టోర్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ బ్రాండ్ ప్రచారకర్తగా విజయ్ రెండేళ్ల పాటు కొనసాగుతారని వెల్లడించారు.