కుమారవర్మ గెటప్ లో జపాన్ లో సుబ్బరాజు... బ్రహ్మరథం పట్టిన జపనీయులు... ఫొటోలు చూడండి!
- జపాన్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న 'బాహుబలి-2'
- ఓ థియేటర్ ను సందర్శించిన సుబ్బరాజు
- ఫొటోలు పోస్టు చేసిన బాహుబలి టీమ్
"జపాన్ వాసులు మా కుమారవర్మపై చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. సుబ్బరాజు ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోయాం" అని ట్వీట్ చేసింది. జపాన్ సినిమా హాల్ లో సుబ్బరాజు తీసుకున్న సెల్ఫీలను మీరు కూడా చూడవచ్చు. సినిమాలోని అన్ని క్యారెక్టర్లూ తమకు నచ్చినప్పటికీ, సుబ్బరాజు పోషించిన కుమారవర్మ క్యారెక్టర్ చాలా సహజంగా ఉందన్నది జపాన్ సినీ ప్రేక్షకుల అభిప్రాయం.
