సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'యూ టర్న్' పూర్తి చేసిన సమంత
- నాగశౌర్యకు బాలయ్య టైటిల్
- విలన్ పాత్రలో 'రోజా' నాయిక
* గతంలో బాలకృష్ణ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పుడీ టైటిల్ని తాజాగా యంగ్ హీరో నాగశౌర్య చిత్రానికి నిర్ణయించనున్నారు. నూతన దర్శకుడు రాజా కొలుసు దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ఈ టైటిల్ని పరిశీలిస్తున్నారట.
* రోజా, అల్లరిప్రియుడు, జంటిల్మెన్ వంటి చిత్రాల ద్వారా అలరించిన కథానాయిక మధుబాల తాజాగా విలన్ పాత్రలో నటించనుంది. బాబీ సింహా హీరోగా తమిళంలో రూపొందుతున్న 'అగ్నిదేవ' చిత్రంలో మధుబాల విలన్ పాత్ర పోషించనున్నట్టు సమాచారం.