‘మీ పెళ్లికి పవన్ అన్న వస్తారా?: రేణూ దేశాయ్ కు నెటిజన్ ప్రశ్న
- నా పెళ్లికి పవన్ వస్తారో? లేదో? ఆయన్నే అడగండి
- నా పిల్లల గురించి మీకెందుకు బాధ?
- రేణూదేశాయ్ ఆసక్తికర సమాధానాలు
* మీ పెళ్లికి పవన్ అన్న వస్తారా?
రేణూ దేశాయ్: ఆయన్నే అడగండి. ఆయన కూడా సోషల్ మీడియాలో ఉన్నారుగా
* పీకే మళ్లీ కలిసుందామంటే వస్తారా?
రేణూ దేశాయ్: మీకు, నిజంగా భారతరత్న ఇవ్వాలి!
* మేడమ్.. మీ పిల్లల గురించే నా బాధ?
రేణూ దేశాయ్: నా పిల్లల గురించి మీరు బాధపడొద్దు. వాళ్లకు తల్లి, తండ్రి.. పెదనాన్న, నానమ్మ, పిన్ని, పెద్దమ్మ... చాలామంది ఉన్నారు. మీరు, అసలు టెన్షన్ పడొద్దు. మీరు, మీ పిల్లలను సంతోషంగా చూసుకుంటే చాలు
* అకీరా హీరోగా యాక్టు చేస్తాడా?
రేణూ దేశాయ్: అకీరాకు యాక్టింగ్ ఇష్టం లేదు
* మీరు వేరే పెళ్లి చేసుకుంటామనడం మాకు బాధగా ఉంది ?
రేణూ దేశాయ్: నేను పెళ్లి చేసుకుంటానంటే మీకెందుకు బాధ? నేను మీ ఇంటి అమ్మాయిని కాదు. మీ ఇంటి అమ్మాయి గురించి మీరు ఆలోచించుకోవాలి. సెలెబ్రిటీస్, పొలిటీషియన్స్ గురించి ఇంత పర్సనల్ గా మీరు ఆలోచించకూడదు.