'పంతం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు
- గోపీచంద్ హీరోగా 'పంతం'
- కథానాయికగా మెహ్రీన్
- వచ్చేనెల 5వ తేదీన రిలీజ్
హైదరాబాద్ .. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరుగుతుంది. గోపీచంద్ కి ఇది 25వ సినిమా కావడం వలన మరింత విశేషాన్ని సంతరించుకుంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక సతమతమైపోతోన్న గోపీచంద్, ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందని భావిస్తున్నాడు. ఆయనకి బాగా అచ్చొచ్చిన యాక్షన్ నేపథ్యంలోని కథ కాబట్టి.. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి.