తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో రవితేజ!
- శ్రీను వైట్లతో రవితేజ
- నెక్స్ట్ మూవీ వి.ఐ ఆనంద్ తో
- త్వరలో సెట్స్ పైకి
ఈ సినిమాలో రవితేజ .. తండ్రీ కొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. తండ్రీకొడుకులిద్దరూ ఒకే పోలికతో ఉన్నప్పటికీ వాళ్లిద్దరి మధ్య ఒక చిత్రమైన వ్యత్యాసం వుంటుందట. ఆ విషయమే ఈ సినిమాకి కీలకంగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారు. ఆల్రెడీ ఒక కథానాయికగా మాళవిక శర్మను ఎంపిక చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదనీ .. ఇంకా కథానాయికలను ఎంపిక చేయలేదని దర్శకుడు వి.ఐ. ఆనంద్ స్పష్టం చేశాడు.