సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రవితేజతో మరోసారి జోడీ కడుతున్న మాళవిక
- రాజమౌళి మల్టీ స్టారర్ చిత్రం కోసం భారీ సెట్స్
- ఆగస్టు నుంచి 'సంఘమిత్ర' షూటింగ్
* ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం భారీ సెట్స్ వేస్తున్నారు. హైదరాబాదు శివారులో లీజుకి తీసుకున్న సువిశాలమైన ప్రాంతంలో ఈ సెట్స్ ను వేస్తున్నారు.
* సుందర్ సి దర్శకత్వంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో 450 కోట్ల భారీ బడ్జెట్టుతో రూపొందుతున్న 'సంఘమిత్ర' సోషియో ఫాంటసీ చిత్రం షూటింగు ఆగస్టు నుంచి జరుగుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. జయం రవి, ఆర్య హీరోలుగా నటించే ఈ చిత్రంలో దిశా పఠాని కథానాయికగా నటిస్తుంది.