నేను ఈ క్షణం గురించే ఆలోచిస్తాను .. అదే నాలోని మైనస్: శుభలేఖ సుధాకర్
- నిన్నటి గురించి పట్టించుకోను
- రేపటి గురించి ఆలోచించను
- ఆలోచించాలి అంటుంది శైలజ
జరిగిపోయిన నిన్నటి గురించి .. జరగాల్సిన రేపటి గురించి నేను ఎంతమాత్రం ఆలోచించను. రేపు ఏమీ లేకపోతే ఎలాగా? అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూసుకుందాములే అనుకుంటాను. నిజం చెప్పాలంటే అది నాలోని మైనస్. ఎందుకంటే రేపటి రోజున అవసరమైన వాటి గురించి అప్పటికప్పుడు వెతుక్కోవలసి వస్తుంది. రేపటి గురించి ఆలోచించడమనేది నేను ఇంతవరకూ నేర్చుకోలేదు. అది నేర్చుకోవాలనే శైలజ ఆశపడుతూ ఉంటుంది" అంటూ ఆయన నవ్వేశారు.