శైలజ .. నేను విడిపోయినట్టుగా రూమర్స్ వచ్చాయి: శుభలేఖ సుధాకర్
- నేను షూటింగులో వున్నాను
- ఒక జర్నలిస్ట్ వచ్చి అలా అన్నాడు
- క్లారిటీ ఇచ్చినా రూమర్ ఆగలేదు
ఆ విషయాన్ని గురించిన ప్రస్తావన 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే 'లో రాగా .. సుధాకర్ తనదైన శైలిలో స్పందిస్తూ .. " ఒకసారి నేను సారథీ స్టూడియోలో 'ఈశ్వర్ అల్లా' అనే సినిమా షూటింగులో వుంటే ఒక జర్నలిస్ట్ వచ్చాడు. నేను శైలజ విడిపోయినట్టుగా విన్నానని అన్నాడు. అలాంటిదేమీ లేదని నేను క్లారిటీ ఇచ్చాను .. అవసరమైతే మా ఇంటికివచ్చి చూడమన్నాను.
'శుభలేఖ సుధాకర్ .. శైలజ విడిపోయారా?' అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి .. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను ఆయన రాసుకొచ్చాడు .. ఆ హెడ్డింగు హైలైట్ కావడంతోనే వచ్చింది చిక్కు. మేం సొసైటీ కోసమే కలిసుంటున్నామనే సందేహం చాలామందిలో ఇప్పటికీ వుంది. ప్రతి వాళ్లకు క్లారిటీ ఇస్తూ కూర్చోలేం .. ఈ రూమర్ ను ఓ దిష్టిచుక్కగా భావించి వదిలేద్దామని శైలజ అంది" అంటూ చెప్పుకొచ్చారు .